హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రహమత్‌నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గతంలో మాగంటి గోపినాథ్ మూడుసార్లు గెలిచారని, నియోజకవర్గంలో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. రాజకీయాల్లో ఆరోపణలు సహజమని, ప్రతిపక్షాల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తామని ఆమె అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa