దేశ స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జాతీయ కవి, రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం వందేమాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే, ఇన్స్పెక్టర్లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ.లు, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గీతాలాపన చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa