ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఫోన్ హ్యాక్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 02:22 PM

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మధ్యలో, బీఆర్ఎస్ ముఖ్య నేత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మొబైల్ ఫోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కమ్యూనికేషన్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే సైబర్ దాడులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. తన ఫోన్ నుంచి తప్పుడు సందేశాలు లేదా కాల్స్ వస్తే నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa