దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్లో ఉన్న ఓ తుక్కు (స్క్రాప్) దుకాణంలో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. పాత సామగ్రి, పైపుల వద్ద ప్రమాదవశాత్తు మంటలు చేలరేగి, రెండు ద్విచక్ర వాహనాలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా పొగ అలముకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 50వేల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఘటనా స్థలాన్ని ఎస్సై కీర్తి రాజు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa