ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డివైడర్‌ను ఢీకొన్న బస్సు, తప్పిన పెనుప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 07, 2025, 04:52 PM

వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒక బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపుకు దూసుకెళ్లింది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔశాపూర్ వద్ద చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు 38 మంది ప్రయాణికులతో జనగామ నుంచి ఉప్పల్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఔశాపూర్ వద్ద ముందున్న కారును డ్రైవర్ ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని అవతలి వైపు రోడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa