TG: మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో స్వాతి అనే మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంటి యజమాని కిషన్ తో వివాహేతర సంబంధం కారణంగానే మహిళ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయంలో కిషన్ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో అతడి అల్లుడు రాజేష్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు రాజేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. తన మామతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కారణంగానే స్వాతిని హత్య చేశానని నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa