పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటిన బీజేపీ... తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి దారుణంగా ఓడిపోయారు. కేవలం 17,061 ఓట్లు మాత్రమే సాధించిన దీపక్ రెడ్డి... డిపాజిట్ కోల్పోయారు. ఈ ఘోర ఓటమితో తెలంగాణలోని బీజేపీ శ్రేణులు తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఓవైపు బీహార్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతుండగా... తెలంగాణలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. డిపాజిట్ కూడా గల్లంతు కావడాన్ని బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa