ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పత్తి కొనుగోళ్లు ఆపొద్దు.. జిన్నింగ్ మిల్లులకు మంత్రి విజ్ఞప్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 15, 2025, 10:35 AM

జిన్నింగ్ మిల్లులు ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు ఆపేస్తామని ప్రకటించడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. మిల్లుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ సెక్రటరీకి ఆదేశాలిచ్చారు. ఎల్1, ఎల్2 నిబంధనలు, తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి కారణంగా రైతులకు కలిగే ఇబ్బందులను సీసీఐ ఎండీకి తెలియజేయాలని సూచించారు. కొనుగోళ్లు కొనసాగించాలని మిల్లులను కోరారు. పత్తి దిగుబడి పరిమితిని 7 నుంచి 11 క్వింటాళ్లకు పెంచాలని కేంద్రంతో రాష్ట్రం చర్చించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa