TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్‌పూర్) అఫిడవిట్లు సమర్పించలేదు. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలో చేరిన బీజేపీ ఎమ్మెల్యేపై వేటు పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై వేటు తప్పదని, ఈ రెండు చోట్ల ఉపఎన్నిక రావొచ్చనే చర్చ జరుగుతోంది. అయితే వేటు పడేకంటే ముందే రాజీనామా చేస్తే బెటరనే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa