మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా శనివారం సాయంత్రం ఆకాశదీపం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తీకమాసంలో నిర్వహించే ప్రత్యేక పూజలు, కార్యక్రమాలలో ఆకాశదీపం ఒకటి. ఈ దీపాన్ని ఆకాశంలోకి ప్రదర్శించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa