తాడుబందు హనుమాన్ దేవాలయంలో అన్నకూట మహోత్సవం, దివ్య జ్యోతి దర్శన కార్యక్రమాలు భక్తి మరియు శ్రద్ధతో ఘనంగా జరిపారు. ఈ వేడుకలకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ, ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, మరియు అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనను ఆలయ మర్యాదలతో సత్కరించగా, వేదపండితులు గణేష్ గారికి వేదాశీర్వచనాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa