సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని తెర్పొల్ గ్రామంలో సోమవారం టి.జి.ఐ.ఐ.సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి సహకార సంఘ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని, పంట నష్టం జరిగిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ఎల్లకొండ ప్రభు, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa