తెలంగాణ కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్ రెండో వారంలో జరగనున్నట్లు మంత్రివర్గం వెల్లడించింది.ప్రజాపాలన వారోత్సవాల తరువాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణలో ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa