చక్రిపురం రెడ్డి కాలనీలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి . మహిళ నాయకురాలు అయినప్పటికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల మీద పోరాడుతూ, అభివృద్ధిపై ఆరాటపడుతూ, అందరి మనసులు గెలుచుకున్న మంచి మనసున్న నేత కార్పొరేటర్ శ్రీ దేవి . ఈ కార్యక్రమంలో భాగంగా నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు హరి వర్ధన్ రెడ్డి, మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మాజీ శాసనసభ్యులు బేతి సుభాష్ రెడ్డి,ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి గార్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు , మహిళా కాంగ్రెస్ నాయకురాలు ,కార్యకర్తలు,అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు .జన్మదిన సందర్భంగా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కార్పొరేటర్ శ్రీమతి బొంతు శ్రీదేవి యాదవ్ గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది