జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం వెంకటాపురం గ్రామంలోని శివాంజనేయ స్వామి దేవస్థానంలో భజన కళాకారుడు లక్ష్మికాంత్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పంచాక్షరి నామస్మరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం రేపు తెల్లవారుజామున 6 గంటలకు మహామంగళహారతితో ముగియనుంది. ఈ సందర్భంగా, పరమ శివుడి పంచాక్షరి మంత్రాన్ని దాదాపు 21,500 సార్లు జపించి, భక్తజనం తరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa