ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరా గాంధీకి ఘన నివాళి: కాంగ్రెస్ నేతల ప్రశంసలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 12:31 PM

రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్దపల్లె డివిజన్, సాయిబాబా నగర్ చౌరస్తాలో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఎన్. ధనుంజయతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa