తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన తప్పుగా జరిగిందని, బీసీల సంఖ్యను తగ్గించి నమోదు చేశారని ఆరోపించారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో బీసీల సంఖ్య గణనీయంగా తగ్గిందని, ఇది ప్రభుత్వం 5-6 శాతం బీసీ జనాభాను తగ్గించిందనడానికి నిదర్శనమని ఆమె అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల లెక్కలు తప్పుగా ఉన్నాయని కవిత పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa