TG: వంటగ్యాస్ వినియోగదారులకు స్వల్పంగా ఊరట లభించింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు తగ్గాయి. ఒక్కో సిలిండర్‌పై రూ.10 మేర తగ్గుముఖం పట్టాయి. ఈ ధరలు నేటి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేసే చమురు కంపెనీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1801.50 వద్ద ఉంది. గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa