దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ ఆదివారం దేవరకొండ పట్టణంలోని తులచ్చమ్మ కుంటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ గాయత్రి మహాయజ్ఞం, అభిషేకం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa