దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు కొనసాగుతోంది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్-చెన్నై, చర్లపల్లి-కోల్‌కతా, హైదరాబాద్-ముంబైకి దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటిలో బెర్తులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు 37 రైళ్లకు 116 కోచ్‌లు అదనంగా జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa