TG: హైదరాబాద్ నగరంలోని హయత్నగర్ పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్య మృతిచెందారు. ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతుండగా అతివేగంతో వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన ఐశ్వర్య, పాండును ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఐశ్వర్య మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం పాండును వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa