పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామేశ్వరం బండ గ్రామంలో జరిగిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవ జాతరలో బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ.. "రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పటాన్‌చెరు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలే ఈ జాతరలు" అని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంతిరెడ్డి గారు, శంకర్ గారు, రాచమల్ల కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa