TG: సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత రుణాలు తీసుకున్న అర్హులైన చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయనున్నట్లు హ్యాండ్లూమ్, టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ నిర్ణయం కార్మికులపై ఆర్థిక భారాన్ని తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa