ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోడిశాల నిఖిత మరణంపై స్పందించిన కిషన్‌రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 06, 2026, 06:23 PM

హైదరాబాద్‌కు చెందిన గోడిశాల నిఖిత (27) అమెరికాలో హత్యకు గురైన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నిఖిత కుటుంబం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తార్నాక విజయపురి కాలనీలో ఉంటోందని అన్నారు.నిఖిత మృతి విషయం తెలియగానే తాను జర్మనీ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మాట్లాడి, మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన సహకారం అందించాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంలో ఢిల్లీలోని తన కార్యాలయం, తెలంగాణ బీజేపీ కార్యాలయం నిఖిత కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తోందని కిషన్‌రెడ్డి తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa