తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే కాకుండా, సన్న బియ్యంతో పాటు మరో ఐదు రకాల నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సన్న బియ్యం పంపిణీలో నాణ్యతలో రాజీ పడబోమని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa