ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధిని ఓర్వలేక బీఆర్ఎస్ అసత్య ప్రచారం: ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 24, 2026, 03:13 PM

రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, సింగరేణి సంస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే అధోగతి పాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడుతూ, 2014 నుండి సింగరేణిని దోచుకున్నది ఎవరో ఎంక్వైరీ కమిషన్ వేసి తేల్చుకుందామని సవాల్ చేశారు. కాంగ్రెస్ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, తెలంగాణలో బీఆర్ఎస్ పతనం మొదలైందని, ప్రజలు వారి ప్రచారాన్ని నమ్మరని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa