బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ వెంటనే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆల్ లీగల్ నోటీసులు పంపించారు. బీజేపీ నేతలకు వేర్వేరుగా లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.ఇరువురు నేతలు కూడా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేటీఆర్ అన్నారు. తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఉద్దేశపూర్వకంగానే వారు తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడారని కేటీఆర్ తెలిపారు. రాజకీయాల కోసం వారు దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్, అరవింద్‌లకు తన న్యాయవాదులతో నోటీసులను పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa