ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెరుగైన పరిపాలన కోసం పిజేఆర్ ఎన్క్లేవ్ ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాల్సిందే : తుమ్మల పాండురంగా రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 31, 2026, 03:43 PM

అమీన్పూర్ : మెరుగైన పరిపాలన, అభివృద్ధి, సంక్షేమం కోసం అమీన్పూర్ సర్కిల్ పరిధిలో పిజేఆర్ ఎన్క్లేవ్ ప్రత్యేక డివిజన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని మాధవపురి హిల్స్, జనప్రియ నైల్ వ్యాలీ, RTC సువర్ణ వ్యాలీ, HMT, వేదిరి. శిల్ప కాలనీలతో నూతన డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన దీక్షను సందర్శించి.. ఆయన సంపూర్ణ మద్దతు పలికారు.దీని మూలంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడం సాధ్యం కాదని తెలిపారు. కిష్టారెడ్డి పేట, పిజేఆర్ ఎన్క్లే పేరుతో నూతనంగా రెండు డివిజన్లు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ మహాదేవ్ రెడ్డి కృష్ణ, కల్పన ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa