సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని పాపయ్యపల్లి స్ఫూర్తి యూత్ క్రీడాకారులకు బెజ్జంకి బిజెపి సోషల్ మీడియా కన్వీనర్ దొడ్ల ప్రశాంత్ జెర్సీలను పంపిణీ చేశారు. కల్లెపెల్లిలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఈ పంపిణీ జరిగింది. యువత క్రీడల్లో రాణించాలని, తద్వారా వారిలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెరుగుతాయని, బెజ్జంకి యువత క్రీడల్లో జిల్లా, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సదుద్దేశంతో టీ షర్ట్‌లు పంపిణీ చేశానని దొడ్ల ప్రశాంత్ తెలిపారు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa