TG: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో పోలీస్ కానిస్టేబుల్ రవిప్రసాద్ వీరంగం సృష్టించాడు. అర్ధనగ్నంగా బయటకు వచ్చి నడిరోడ్డుపై భార్యా, బిడ్డలను అతి కిరాతకంగా చితకబాదాడు. అతడి భార్య కూడా పోలీస్ శాఖలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి వద్దకు వెళ్లి విచారణ చేయగా, భార్య, మూడేళ్ల కూతురిని ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు తెలిసింది. ఆ ఘటనను స్థానికులు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేసి పోలీసులకు అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa