ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేటీఆర్ వ్యాఖ్యలు నియంతృత్వ, రాచరికపు పోకడలకు నిదర్శనం: కవిత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 06:50 PM

TG: మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు చేశారు. సోమవారం కవిత మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల్లో BRS తరఫున ఎవరు నిలబడ్డ కారు గుర్తుపై ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారని, అంటే చెడ్డ వాళ్లకి కూడా ఓటు వేయాలని కేటీఆర్ చెబుతున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విచారణకే పిలవొద్దు అంటున్న కేటీఆర్ ఇలాంటి రాచరిక పోకడల ఆలోచనలు మారకపోతే బీఆర్ఎస్‌ను ఎవరూ కాపాడలేరు అని కవిత మాట్లాడారు. అదే విధంగా కేసీఆర్‌ను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను విచారణకు పిలిచే పరిస్థితి ఎందుకు వచ్చిందో బీఆర్ఎస్ ఆలోచించుకోవాలని సూచించారు. అయితే గుంటనక్కతో కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంది. అందుకే ఈ కేసులో విచారణ పూర్తి చేస్తారని తనకు నమ్మకం లేదని కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల కోసమే ఈ కేసును అటు, ఇటు తిప్పుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండేళ్లుగా కేసు ఎందుకు ముందుకుపడటంలేదని ఎద్దేవా చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa