ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇద్దరు పిల్లలతో కలిసి చనిపోయిన తల్లి.. కాల్ డేటా ఆధారంగా విచారణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 11:24 AM

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విజయారెడ్డి ఇంటి నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు మార్గమధ్యలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఏదో బలమైన కారణమే ఉందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.. విజయశాంతి రెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్‌ను CCS పోలీసులకు పంపారు. మొబైల్‌లో కొన్ని అనుమానిత మెసేజ్‌లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.. ఈ కేసుకు సంబంధించి రైల్వే డీఎస్పీ తాజాగా ఎన్టీవీతో మాట్లాడారు. “ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విజయ శాంతి రెడ్డి కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.. కుటుంబ సభ్యులను విచారించాం. ఎలాంటి కుటుంబ కలహాలు లేవు అని చెప్తున్నారు.. ఉద్యోగం చేస్తున్న సంస్థలో కూడా విచారించాం. అక్కడ కూడా ఎలాంటి సమస్యలు లేవు.. విజయరెడ్డి, ఇద్దరు పిల్లలని తీసుకుని 30న అర్ధరాత్రి స్టేషన్‌కు వచ్చారు.. ఫ్లాట్ ఫాంపై కొద్దిసేపు పిల్లలతో కలిసి తిరిగారు. చర్లపల్లి వైపు ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్ళి.. గూడ్స్ ట్రైన్ వస్తున్న సమయంలో ట్రాక్ మధ్యలో నిల్చున్నారు. గూడ్స్ ట్రైన్ లోకో పైలట్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఇతను చెప్తున్న ప్రకారం.. ట్రాక్ మధ్యలో ముగ్గురూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకుని నిల్చున్నారు. గట్టిగా కేకలు వేస్తూ తప్పుకోండి అని అరుస్తున్న కూడా పక్కకు జరగలేదని చెప్తున్నాడు.. కారులో సూసైడ్ నోట్ లభ్యమైంది.. నా చావుకి ఎవరూ కారణం కాదు. బతకడం భారంగా ఉంది అని రాసి ఉంది. 28న వాళ్ళ పెళ్లి రోజు అని తెలిసింది.. 31న భర్త పుట్టిన రోజు అని తెలిసింది.. బంధువులు ఒకరు చనిపోయారు.. వెళ్ళాలి అని హాస్టల్ లో ఉన్న పిల్లలను తీసుకెళ్లింది తల్లి.. విజయశాంతి మొబైల్ ఫోన్‌ను సీసీఎస్‌కి పంపించాం. లాస్ట్ కాల్ డీటెయిల్స్, అందులో ఉండే సమాచారంతో మరికొన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఆమె ల్యాప్ టాప్‌ను కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించాం.” అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa