ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్వాల కాంగ్రెస్‌లో బీ ఫామ్‌ల గందరగోళం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 03:11 PM

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో జోగులాంబ గద్వాల కాంగ్రెస్‌లో సీట్ల పంపకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. 37 వార్డులకు గాను 7 సీట్లు సరిత తిరుపతయ్య వర్గానికి, 30 సీట్లు ఎమ్మెల్యే బండ్ల వర్గానికి కేటాయించినట్లు వార్తలు వస్తున్నా, ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులందరికీ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌లు జారీ చేసింది. అయితే, సరిత వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు కూడా 7 వార్డులకు బీ ఫామ్‌లతో దర్శనమిచ్చారు. ఇప్పటికే ఆ 7 వార్డులకు ఎమ్మెల్యే వర్గానికి చెందిన అభ్యర్థులు బీ ఫామ్‌లు సమర్పించడంతో, ఒకే వార్డుకు రెండు వర్గాలకు బీ ఫామ్‌లు ఇవ్వడంపై గందరగోళం నెలకొంది. చివరికి ఎవరి బీ ఫామ్‌లు చెల్లుతాయో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa