ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేబుల్ బ్రిడ్జి మీద అగ్ని ప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 04:39 PM

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి మీద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయం ఓ ద్విచక్ర వాహనం బ్రిడ్జిపై దగ్ధమైంది. రన్నింగ్ లో ఉండగా బైక్ లో మంటలు ఎగసిపడ్డాయి. తోటి వాహనదారులు అప్రమత్తం చేయడంతో బైక్ పై వెళుతున్న యువకుడు వెంటనే వాహనాన్ని ఆపేశాడు. బ్రిడ్జిపైన ఓ పక్కకు స్టాండ్ వేసి నిలిపాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడి ఆ బైక్ మొత్తం కాలిబూడిదైంది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa