ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 11:14 AM

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించిన నితిన్ నబిన్, 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల అనంతరం జాతీయ అధ్యక్షుడిగా ఆయన తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పార్టీ బలోపేతం కోసం నిర్వహించనున్న 'బూత్ కార్యకర్తల సమ్మేళనం'లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఆయన పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించింది.బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ రోజు ఉదయం 10:45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:00 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం అక్కడ పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి, మధ్యాహ్నం 3:00 గంటలకు మహబూబ్‌నగర్‌లోని MVS డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు MVS డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. సాయంత్రం 4:15 గంటలకు మహబూబ్‌నగర్ నుండి బయలుదేరి, సాయంత్రం 5:45 గంటలకు తిరిగి శంషాబాద్ చేరుకుంటారు. రాత్రి 6:35 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ షెడ్యూల్ ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa