ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందోల్ జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 12:54 PM

అందోల్ జోగిపేట  మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన . 25 నెలల్లో కేవలం అందోల్ జోగిపేట మున్సిపాలిటీకి 250 కోట్ల నిధులు . మున్సిపల్ పరిధిలో మరో 320 కోట్ల అభివృద్ధి పనుల కొరకు  మంత్రి దామోదర రాజనరసింహ గారు ప్రభుత్వానికి పంపిన ప్రపోసల్స్ కి త్వరలో గ్రీన్ సిగ్నల్.
రూపురేఖలు మారనున్న అందోల్ జోగిపేట మున్సిపాలిటీ
అందోల్–జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున 20 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల అధికారిక జాబితాను ప్రకటించడమైనది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా, సుమారు 16,550 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగల అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది.


అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అందోల్–జోగిపేట్ ప్రాంతంలో ఇప్పటికే కొనసాగుతున్న, మంజూరైన మరియు రాబోయే కీలక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాము.


మంత్రి దామోదర్ రాజనరసింహ గారి కృషితో మంజూరై కొనసాగుతున్న అభివృద్ధి పనులు:
జోగిపేట్ నుంచి అజ్జమర్రి వరకు రహదారి అభివృద్ధికి రూ.80 కోట్లు, సంగుపేట నుంచి అన్నసాగర్ వరకు డివైడర్ లైట్లతో కూడిన 4 లేన్ రోడ్డు నిర్మాణానికి రూ.20 కోట్లు, అంబెడ్కర్ చౌరస్తా నుండి మధ్యరంగం, NH–161 వరకు రోడ్డు విస్తరణ
ఎంపీడీఓ కార్యాలయ పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.20 కోట్లు, కొత్త మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి రూ.6 కోట్లు, 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు (దీనిలో 50 పడకల మాతా–శిశు సంరక్షణ MCH విభాగం)కు రూ.60 కోట్లు,నర్సింగ్ కళాశాల స్థాపనకు రూ.43 కోట్లు, రూ.2 కోట్లతో వివేకానంద పార్క్ అభివృద్ధి, రూ.2 కోట్లతో అందోల్ చెరువు సుందరీకరణ, రూ.5 కోట్లతో చెరువు ఒడ్డున సాంస్కృతిక (కల్చరల్) భవనం నిర్మాణం,రూ.5.75 కోట్లతో RDO కార్యాలయం & నివాస సముదాయం నిర్మాణం, రూ.2 కోట్లతో మున్సిపల్ ప్రవేశద్వారం వద్ద (సంగుపేట అండర్‌పాస్) వెల్‌కమ్ ఆర్చ్ నిర్మాణం


ఈ అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రహదారులు, పరిపాలన, ఆరోగ్యం, విద్య, పట్టణ సౌకర్యాలు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక భద్రత వంటి అన్ని రంగాలు సమగ్రంగా బలోపేతం కానున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల విస్తరణ, పారదర్శక పాలనతో పాటు సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని పార్టీ అభ్యర్థులు ప్రజలకు భరోసా ఇస్తున్నారు.ప్రజల విశ్వాసం మరియు ఆశీర్వాదాలతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ ఘన విజయం సాధించి, అందోల్–జోగిపేట్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa