ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ రాజకీయాలు తెలంగాణాలో నడవవు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 03:57 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ఆంధ్ర నాయకుడని, ఆయన తెలంగాణ వ్యతిరేకి అని ఘాటుగా వ్యాఖ్యానించారు. పవన్ తన రాజకీయాలను ఆంధ్రాలోనే చేసుకోవాలని, తెలంగాణలో ఆయన ప్రచారం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మహేశ్ గౌడ్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి."బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను భిక్షాం దేహీ అని అడిగారు" అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో పవన్ తెలంగాణ గురించి చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వ్యక్తి మాటలు విని ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని అన్నారు. ఆయన మాటలను ఎవరూ విశ్వసించరని, ఆయన ప్రభావం తెలంగాణ రాజకీయాలపై శూన్యమని స్పష్టం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa