ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదాల్లో భాదితులని కాపాడిన వారికీ నగదు పురష్కారం ఇవ్వనున్న ప్రభుత్వం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:46 PM

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే వారికి నగదు బహుమతి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారికి రూ. 25,000 నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'రహ వీర్‌' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయాలని రాష్ట్ర‌ రవాణా శాఖ నిర్ణయించింది.ఈ మేరకు రవాణా శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అనేకమంది పోలీసు కేసుల భయంతో లేదా ఇతర కారణాలతో బాధితులకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని, ఈ ధోరణిని మార్చడానికే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. బాధితులను ఆదుకున్న వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రం కూడా అందించి గౌరవిస్తామని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa