ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖానామెట్‌లో 5 ఎక‌రాలను కాపాడిన హైడ్రా..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 11:21 AM

 హైటెక్స్ ఎగ్జిబిష‌న్ గ్రౌండ్స్‌కు సమీపంలోని ఖానామెట్‌లో ఆల్ ఇండియా వెల‌మ సంఘానికి 5ఎక‌రాలు ప్ర‌భుత్వం కేటాయించింది. ఈ స్థ‌లం చుట్టూ ప్రీకాస్ట్ వాల్‌తో ప్ర‌హ‌రీ నిర్మిస్తుండ‌గానే.. కుల సంఘాల‌కు స్థ‌లాలు కేటాయించ‌డంపై కొంత‌మంది కోర్టుకెక్క‌డంతో హైకోర్టు స్టే ఇచ్చింది. ఇదే అద‌నుగా ఆ స్థ‌లాన్ని వెనుక వైపు నుంచి అక్క‌డ ఉన్న స్థానికులు మ‌ట్టిపోస్తూ క‌బ్జాచేస్తున్నార‌ని.. అదేమ‌ని అడిగితే వాచ్‌మ్యాన్‌పై దాడి చేస్తున్నార‌ని ఆ సంఘం ప్ర‌తినిధులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పును బ‌ట్టి నిర్ణ‌యం ఉంటుంది.. ఈ లోగా అక్క‌డి స్థ‌లం క‌బ్జాకు గురి కాకుండా చూడాల‌ని హైడ్రాను కోరారు. ఈమేర‌కు క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి క‌బ్జాల‌కు ఆస్కారం లేకుండా 5 ఎక‌రాల మేర ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa