ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర.. ముగ్గురు అరెస్ట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 05:52 PM

ఉగ్రవాద దాడులకు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలతో మరోసారి హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. చంచల్‌గూడ జైలు ములాఖత్ నుంచి ఈ ఉగ్ర కుట్రకు ప్రణాళికలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చంచల్‌గూడ జైలు నుంచే ఈ ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. జైలు నుంచే ఉగ్ర కుట్రకు ప్రణాళికలు సాగినట్లు అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు.. వరుసగా పేలుళ్లు జరిపేందుకు కుట్ర చేస్తారన్న ఆరోపణల కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.


ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. మరీ ముఖ్యంగా మూసారాంబాగ్, మలక్‌పేట్, సైదాబాద్ ప్రాంతాలు ప్రస్తుతం పోలీసుల కంట్రోల్‌లో ఉన్నాయి. పాకిస్తాన్‌ అడ్డాగా పనిచేసే లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది.. చంచల్‌గూడ జైలు నుంచి ఈ ఉగ్రకుట్ర చేసినట్లు ఆరోపణలు రావడంతో అలర్ట్ అయ్యారు.


ఈ ఉగ్రవాదితో ములాఖత్‌ అయ్యేందుకు వచ్చిన తన భార్యతో ఆ టెర్రరిస్ట్ ఉగ్రదాడుల గురించి సంభాషణలు చేసినట్లు సమాచారం. తన భార్య ద్వారా జైలు నుంచి బయటికి ఉగ్ర సమాచారాన్ని చేరవేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉగ్రకుట్రకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. నగర పోలీసులు హై అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత చేపట్టినట్లు వెల్లడించారు.


మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించిన వేళ.. హైదరాబాద్‌లో కూడా అలాంటి దాడుల హెచ్చరికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్ వద్ద ఆలయాల్లో పేలుళ్లు జరిపేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారీ ఎత్తున ఐఈడీ పేలుళ్లకు ప్రయత్నాలు ఉగ్రవాదులు చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులను నిఘా వర్గాలు హెచ్చరించాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa