ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లారీ విద్యుత్ తీగలకు తగిలి దగ్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 21, 2026, 07:56 PM

టేక్మాల్ మండలంలోని ఎల్లుపెట్ ప్రధాన రహదారిపై శనివారం పశుగ్రాసంతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలకు తగిలి మంటల్లో చిక్కుకుంది. ఎల్లుపేట్ నుండి హైదరాబాద్‌లోని జియాగూడ గోశాలకు పశుగ్రాసాన్ని తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, వారిని పాపన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం, సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa