ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో షాకింగ్ రివీల్.. అల్లం పేస్ట్ తయారీపై సంచలనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 11:57 PM

Hyderabad నగరంలో మరో కల్తీ ఆహార తయారీ కేంద్రం బయటపడింది. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్‌కు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎం.ఎస్. మఖ్తా రైల్వే గేట్ సమీపంలోని ఓ ఇంటిపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.తనిఖీల్లో అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితుల్లో అల్లం–వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ పేస్ట్ మానవ ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు.అబిడ్స్ ప్రాంతానికి చెందిన జసాని ఇల్యాన్ ‘JJ ఫుడ్స్’ పేరిట ఈ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గడువు ముగిసిన FSSAI లైసెన్స్‌ను ఉపయోగిస్తూ హోటళ్లు, కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. తయారైన పేస్ట్‌ను మూతలు లేకుండా ప్లాస్టిక్ టబ్బుల్లో నిల్వ చేయడంతో ధూళి, ఈగలు తదితర కాలుష్యాలు చేరి అది వినియోగానికి ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు.దాడుల్లో సుమారు 4 వేల కేజీల కల్తీ పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 40 టబ్బుల్లో 1,600 కేజీలు, 5 కేజీల కంటైనర్లు 130, 1 కేజీ కంటైనర్లు 900, 500 గ్రాముల కంటైనర్లు 300, 200 గ్రాముల కంటైనర్లు 3,000, 50 గ్రాముల ప్యాకెట్లు 2,000 ఉన్నాయి. అదనంగా రెండు గ్రైండింగ్ యంత్రాలు, 5 కేజీల పసుపు పొడి, 20 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 40 బస్తాల ఉప్పు మరియు సరఫరాకు ఉపయోగిస్తున్న గూడ్స్ ఆటోను సీజ్ చేశారు.నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం లేక్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.రు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa