ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో గ్రామ కార్యదర్శి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 27, 2026, 11:04 AM

హాలియా: మండలంలోని పులిమామిడి గ్రామ కార్యదర్శి అవుట మోహన్ రావు (55) నల్లగొండ నుంచి పులిమామిడికి వస్తుండగా కనగల్ మండలం లింగోటం స్టేజి సమీపంలో డీసీఎం వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఉద్యోగరీత్యా పులిమామిడి గ్రామంలో పని నిమిత్తం ఉదయమే వస్తుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ కార్యదర్శి మోహన్ రావు మృతి పట్ల గ్రామ సర్పంచ్ మాలే అరుణ సత్యనారాయణ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa