ధర్పల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరగాల్సిన ఇసుక బహిరంగ వేలం అనివార్య కారణాలవల్ల రద్దయింది. తాసిల్దార్ శాంత అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. మండలంలోని పునాజీపేట్, కొట్టాలపల్లి గ్రామాల్లో అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సుమారు 20 ట్రాక్టర్ల ఇసుకను ఈరోజు వేలం వేయాల్సి ఉండగా, వేలం మరో రోజు ఉంటుందని తాసిల్దార్ శాంత పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa