ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు యువతలో పెరుగుతున్న నేపథ్యంలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని చూసి భయపడాల్సిన అవసరం లేదని, అది మనిషికి ప్రత్యామ్నాయం కాదని ఆయన స్పష్టం చేశారు.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఏఐ అనేది కేవలం ఒక సాధనం మాత్రమే. అది మనిషి ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను ఎప్పటికీ భర్తీ చేయలేదు" అని ఆయన పేర్కొన్నారు. గతంలో కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయని, కానీ అవి మరిన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించాయని గుర్తుచేశారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను చూసి భయపడటం కంటే, వాటిని అందిపుచ్చుకుని నైపుణ్యాలు పెంచుకోవాలని యువతకు ఆయన సూచించారు. ముఖ్యంగా ఏఐ టూల్స్‌ను సమర్థవంతంగా వినియోగించడం నేర్చుకుంటే, ఐటీ రంగంలో కెరీర్‌కు ఎలాంటి ఢోకా ఉండదని భరోసా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa