కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్–15వ వార్డులో శ్రీ నల్ల పోచమ్మ తల్లి ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఆలయ అభివృద్ధి మరియు ప్రాంతీయ సంక్షేమానికి సహకారం అందిస్తానని కొలన్ హన్మంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa