కేశంపేట మండలం బైరఖాన్పల్లి గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాలలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొన్నారు. ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, కేశంపేట మండలం అభివృద్ధి చెందాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ దేవాలయాల అభివృద్ధికి, ధార్మిక సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇచ్చిందని, గ్రామీణ సంస్కృతి, క్రీడలను పరిరక్షించడం తమ పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa