పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సెయింట్ మేరీస్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తులసి రెడ్డి గారి ఆహ్వానంపై ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు హాజరై రిబ్బన్ కట్ చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ ద్వారా విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శించుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అనంతరం పృథ్వీరాజ్ గారు ప్రతి ప్రదర్శన విభాగాన్ని సందర్శించి, విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. వారి ప్రతిభను అభినందిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ గారు, సాయి తేజ గారు, రమణ గారు, ధనరాజ్ గౌడ్ గారు, రాజు గారు, షకీల్ గారు, మహేష్ గారు, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు ఎంపిఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.*
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa