ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 1 నుంచి జై శ్రీరామ్‌ ఇటుకల విక్రయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 10:06 AM

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి 'జైశ్రీరామ్' నామంతో ప్రత్యేక ఇటుకలను విక్రయించనున్నారు. ఒక్కో ఇటుక ధర రూ.60గా అంచనా వేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్ద యంత్రాన్ని ఏర్పాటు చేసి ఇసుక, మట్టి, సిమెంట్‌ మిశ్రమంతో ఈ ఇటుకలను తయారు చేస్తున్నారు. వీటిని తయారుచేసి విక్రయించేందుకు ఒక గుత్తేదారు ఏడాదికి రూ.1.60 లక్షలు ఆలయానికి చెల్లించనున్నారు. చిత్రకూట మండపం సమీపంలో భక్తులకు ఈ ఇటుకలు అందుబాటులో ఉంచనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa