ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగారెడ్డి జిల్లాలో RTC బస్సుకు యాక్సిడెంట్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 28, 2026, 12:17 PM

సంగారెడ్డి జిల్లాలో PSML బైపాస్ వద్ద వేగంగా వచ్చిన లారీ RTC బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు సదాశివపేట, సంగారెడ్డికి చెందిన 108 సిబ్బంది గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa